వైఎస్సార్‌ సీపీలోకి రైల్వే యూనియన్‌ లీడర్‌ అజయ్‌కుమార్‌ | Retired RailwayUnion Leader Join in YSRCP Visakhapatnam | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి రైల్వే యూనియన్‌ లీడర్‌ అజయ్‌కుమార్‌

Jan 29 2019 7:28 AM | Updated on Jan 29 2019 7:28 AM

Retired RailwayUnion Leader Join in YSRCP Visakhapatnam - Sakshi

అజయ్‌కుమార్‌ దంపతులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి,విశాఖపట్నం: విశాఖకు చెందిన రైల్వే యూని యన్‌ లీడర్, రిటైర్డ్‌ ఉద్యోగి వేలుపుల అజయ్‌కుమార్, అతని భార్య మాజీ కార్పొరేటర్‌ ప్రేమకుమారి వైఎస్సార్‌ సీపీలో సోమవారం చేరారు. లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అజయ్‌కుమార్‌ దంపతులు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రాజన్న రాజ్యం మళ్లీ రావాలని కోరుకుంటున్నారని, జగనన్న నాయకత్వంతోనే అది సాధ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయానికి అహర్నిశలు కష్టపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, ఉత్తరాంధ్ర బీసీ అధ్యయన కమిటీ అధ్యక్షుడు పక్కి దివాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement