
లక్నో : పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలపై ముస్లిం సమాజంలో నెలకొన్న భయాన్ని, ఆందోళనను తొలగించాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ చట్టాలపై వారికి అవగాహన కల్పించి పూర్తిగా సంతృప్తిపరచాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆందోళనల ముసుగులో రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నిస్తున్న పార్టీల పట్ల ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముస్లింలు అణచివేతకు, రాజకీయ దోపిడీకి గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న హింసపై స్పందిస్తూ.. శాంతియుత ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం దురదృష్టకరమని మాయావతి వ్యాఖ్యానించారు. చదవండి : వాళ్ల దోస్తీ ఎలాంటిదో చెప్పాలి : మాయావతి