రాజాసింగ్‌, పవన్‌ కళ్యాణ్‌లపై మహేశ్‌ కత్తి ఫైర్‌

 Rajasingh request to city police register case on Mahesh kathi - Sakshi

మహేశ్‌ కత్తిపై కేసు నమోదు చేయాలన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌

చట్టాలు తెలియని ఎమ్మెల్యే అంటూ కత్తి సెటైర్‌

పవన్‌ ఒంగోలు పర్యటనను విడిచిపెట్టని కత్తి

సాక్షి, హైదరాబాద్‌: సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తిపై కేసు నమోదు చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మహేశ్‌ కత్తి తనదైన శైలిలో స్పందించారు. ‘చట్టం తెలియని ఒక ఎమ్మెల్యే నా మీద ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినంత మాత్రాన ఏమీ కాదు. ఎవరు కంగారు పడకండి. ఆ ఫిర్యాదు చెల్లదు. అది కేసు అసలే కాదు. నాకు చట్టాల గురించి బాగా తెలుసని పోస్ట్‌ చేశాడు’.

అంతకు ముందు చీప్‌ పబ్లిసిటీ కోసం మహేశ్‌ కత్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నరహంతకుడితో పోల్చాడని వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ ట్వీట్‌ చేశారు. కాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించే క్రమంలో మహేశ్‌ కత్తి మోదీని నరహంతకుడితో పోల్చిన విషయం తెలిసిందే.

ఏమాత్రం తగ్గని కత్తి..
ఇప్పటి వరకు కేవలం పవన్ కళ్యాణే టార్గెట్‌ చేసిన మహేష్‌ కత్తి తాజా పోస్టులో మోదీ వ్యాఖ్యలపై విమర్శనస్త్రాలు విడిచారు. మణిశంకర్ అయ్యర్ అన్నాడు. మోదీ రుజువు చేసుకున్నాడు. మణిది బాధ్యత లేని వాగుడు. మోదీది బాధ్యత మరిచిన సణుగుడు. అంతే! అన్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ ఒంగోలు పర్యటనను విడిచి పెట్టిన మహేశ్‌ కత్తి ప్రశ్నించే నాయకుడికి మరో ప్రశ్నవేసాడు.

బాబును రాజీనామ చేయమను పవన్‌ కళ్యాణ్‌
‘నిజమే...ఎక్కడో రైలు దుర్ఘటన జరిగితే లాల్ బహుదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారు. ఇలా అయితే చంద్రబాబు ఎన్ని సార్లు రాజీనామ చెయ్యాలో. ఒకసారైనా రిజైన్ చెయ్యమని కోరకూడదా పవన్ కళ్యాణ్!’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.

ఇప్పటికే పవన్‌ అభిమానులు మహేశ్‌ కత్తిని బద్ద శత్రువుగా చూస్తుండగా.. తాజాగా రాజాసింగ్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీజేపీ కార్యకర్తలు సైతం ఆయనకు వ్యతిరేకంగా మారనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top