‘దారి’చూపని ముఖ్యమంత్రి 

Rajampeta Villagers Fires On Nara Chandra Babu Naidu For Non Fulfillment Of Promises - Sakshi

సాక్షి,రాజాంపేట:  రాజాం ప్రధాన రహదారిని విస్తరిస్తాం. రాజాం పట్టణంలోని చెరువులను పార్కులుగా మారుస్తాం. హైటెక్‌ సిటీ, శాటిలైట్‌ సిటీ నిర్మాణం చేపడతాం. తోటపల్లి మిగులు భూములకు నీరు అందిస్తాం.’ అని 2017వ సంవత్సరం జనవరి 6న రాజాంలో నిర్వహించిన ‘జన్మభూమి మా ఊరు’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలివి. అప్పట్లో రాజాం బస్టాండ్‌ ఆవరణలో జరిగిన ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమంలో సీఎం ఈ హామీలు ఇవ్వగా రెండేళ్లు దాటినా ఇప్పటికీ అవి పూర్తికాలేదు.

రాజాం ప్రధాన రహదారి ఇరుగ్గా ఉండడంతో విస్తరిస్తామని 2017లో సీఎం హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణకు రూ.56 కోట్లు మేర నిధులు కావాల్సి ఉండగా ఇప్పటి వరకూ రూ.10 కోట్లు మేర మాత్రమే వచ్చాయి. ఏడాది కాలంగా అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి బొబ్బిలి జంక్షన్‌ వరకూ రోడ్డు విస్తరణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకూ ఆ పనులు కొలిక్కి రాలేదు. ఇలాంటి హామీలు ఇచ్చిన బాబును ఎందుకు నమ్మాలి? అని రాజాం పట్టణ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.                                                         
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top