మేక్‌ ఇన్‌ ఇండియా అంటూ చైనావే కొంటోంది

Rahul Gandhi Criticises BJP Government Over China Goods Buying - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ మేక్‌ ఇన్‌ ఇండియా అని ప్రచారంచేస్తోంటే ప్రభుత్వమేమో చైనా ఉత్పత్తులనే కొంటోందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికీ, బీజేపీ ప్రభుత్వానికీ అంతరం ఉన్నదని గ్రాఫ్‌ ద్వారా ట్విట్టర్‌లో రాహుల్‌ వెల్లడించారు. ప్రస్తుతం బీజేపీ హయాంలో చైనా నుంచి దిగుమతులు పెరిగాయని రాహుల్‌ అన్నారు. భారత భూభాగం నుంచి చైనా సైన్యాన్ని ఎప్పుడు, ఎలా తరిమికొడతారో చెప్పాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు.

యాప్స్‌పై నిషేధం ఒక్కటే చాలదు: మమత
చైనా యాప్‌లపై నిషేధం ఒక్కటే సరిపోదని, చైనాకు తగిన జవాబు చెప్పాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఈ విషయంపై నిర్ణయాన్ని కేంద్రానికే వదిలేస్తున్నానని మమత చెప్పారు. ఇది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయమని, అయితే ప్రభుత్వ విధానానికి తాము మద్దతిస్తామన్నారు. ఈ విషయంలో దౌత్య విధానాలను అవలంబిస్తూనే, దూకుడుగా వ్యవహరించాలని ఆమె అభిప్రాయపడ్డారు. దేశ భద్రతకు ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో టిక్‌టాక్‌సహా 59 చైనా యాప్‌లపై భారత్‌ నిషేధం విధించడం తెల్సిందే.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top