ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ములేదు

peddi reddy ramchandra reddy fired on cm chandrababu - Sakshi

హామీలు నెరవేర్చని చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం

జగన్‌ పాదయాత్రతో టీడీపీ గుండెల్లో రైళ్లు

పులిచెర్ల మండల పర్యటనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పీలేరు/కల్లూరు: సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామా చే యించి ఎన్నికలకు వెళ్లే దమ్ముధైర్యం సీఎం చంద్రబాబునాయుడుకు లేదని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఇంటింటికీ వైఎస్సార్‌ కుటుం బంలో భాగంగా పులిచెర్ల మండలం కొడిదపల్లెలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఎం అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ గుర్తుపై గెలిచిన వారికి రూ.కోట్లు    ఇచ్చి కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆరోపిం చారు. ఈ ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేసే వరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. 

పులిచెర్ల మం డలంలోని దిగువపోకలవారి వారిపల్లె, 102ఇరామిరెడ్డిగారిపల్లె, ఎర్రపాపిరెడ్డిగారిపల్లె, పులిచెర్ల, రెడ్డివారిపల్లె, కమ్మపల్లె, అయ్యావాండ్లపల్లెలో ఆయన పర్యటించారు. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రకు లభిస్తున్న ఆదరణ చూసి  జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సీఎం దిగజారుడుతనానికి నిదర్శమని, ముందు  ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చాలని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top