'బాబును కాపాడాలనేదే పచ్చపత్రికల తాపత్రయం'

Parthasarathy Comments About Writing Fake News In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి : రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల నుంచి ప్రజల దృష్టిని మరల్చటం కోసం కొన్ని పచ్చ పత్రికలు రియల​ ఎస్టేట్‌ వ్యాపారం పడిపోతున్నట్లు కథనాలు రాస్తున్నారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మండిపడ్డారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇవ్వడానికి ముందే ఉండవల్లి, తాడేపల్లిలోని భూములకు రూ. మూడు నుంచి నాలుగు కోట్ల ధరలున్నట్లు పేర్కొన్నారు. అయితే రాజధానికి భూములు ఇవ్వలేదని మంగళగిరి పరిధి గ్రామాలో​ ధరలు పడిపోయేలా చంద్రబాబే చేశారంటూ పార్థసారథి ధ్వజమెత్తారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ధరలు పడిపోవడానికి బాబు తీరే కారణమని, ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పినప్పుడు మురళీమోహన్‌ వంటి వారు అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎందుకు చేయలేదని ఎద్దేవా చేశారు. సీఎం దగ్గర పీఎస్‌గా పనిచేసిన వ్యక్తితో కాంట్రాక్టర్లు ఎటువంటి లావాదేవీలు పెట్టుకోరన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ వికేంద్రీకరణ ప్రకటన తర్వాత రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే  రియల్‌ ఎస్టేట్‌ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన చేశారని, దానిని కూడా టీడీపీ నేతలు రాజకీయాలుగా చూడడాన్ని పార్థసారథి తప్పుబట్టారు.(న్యాయశాఖ మంత్రిని కలిసిన సీఎం జగన్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top