ఢిల్లీ విజయాన్ని మూడు ముక్కల్లో తేల్చేసిన బిహార్‌ సీఎం

Nitish Kumars 3 Word Reaction To Arvind Kejriwals Victory - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్‌ 62 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠాన్ని మూడోసారి అధిరోహించబోతున్న కేజ్రీవాల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

(హస్తిన తీర్పు : ‘ఇది ఢిల్లీ ప్రజల విజయం’)

ఈ సందర్భంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. 'జనతా మాలిక్ హై (ఓటర్లే రాజులు)' అంటూ ఆయన మూడు ముక్కల్లో కేజ్రీవాల్‌ విజయంపై తన స్పందనను తెలియజేశారు. బీజేపీతో నితీశ్‌ సారథ్యంలోని జేడీయూ పొత్తు నేపథ్యంలో ఢిల్లీలో రెండు అసెంబ్లీ స్థానాల్లో జేడీయూ పోటీ చేసింది. అమిత్ షాతో కలసి నితీశ్ మూడు స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై నితీశ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ కేవలం ఉచితంగా ఇచ్చే వాటిపైనే మాట్లాడుతున్నారని.. వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

కేజ్రీవాల్‌కు సీఎం జగన్‌ అభినందనలు

ఆప్‌ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top