
సీనియర్ నటుడు, వైఎస్సాఆర్‌సీపీ నేత మోహన్ బాబు తనపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పదించారు. మోహన్‌బాబు టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్టుగా వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు. తాను ఎలాంటి పదవులు ఆశించిన రాజకీయాల్లోకి రాలేదన్నారు.
‘నేను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రేసుల్లో ఉన్నట్టుగా వార్తలు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నా ఆశయం వైఎస్ జగన్‌మెహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడటం. అందుకోసం నా వంతుగా కష్టపడ్డాను. నేను తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కారణం వైఎస్ జగన్ ప్రజల ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకమే గాని ఎలాంటి పదవులు ఆశించి కాదు. మీడియాకు నా విన్నపం పుకార్లను ప్రోత్సహించకండి’ అంటూ మోహన్ బాబు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
I have been reading the news &getting calls that I am in the race for TTD Chairman post. My amibition was to see Shri.Jagan as the CM & worked towards it &contributed my bit. I came back to politics because of my belief in @ysjagan as people’s CM ¬ for any posts or nominations
— Mohan Babu M (@themohanbabu) 5 June 2019
And I request the media to stop speculating.
— Mohan Babu M (@themohanbabu) 5 June 2019