వైఎస్సార్‌సీపీలో చేరిన ఎమ్మెల్సీ శమంతకమణి

MLC Samanthakamani Resigns To TDP  - Sakshi

మాజీ ఎమ్మెల్యే యామినిబాల కూడా..

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అనుభవం లేని వ్యక్తుల ఆధిపత్య పోరు ఎక్కువైందని ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి సీనియర్లు చాలా మంది సందిగ్దంలో ఉన్నారన్నారు. టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెందే పార్టీకి రాజీనామా చేశామన్నారు. బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో శమంతకమణి, యామినిబాల వైఎస్సార్‌సీపీలో చేరారు. వారు మాట్లాడుతూ.. ‘దిశ’, ‘అమ్మఒడి’ లాంటి పథకాలకు ఆకర్షితులమయ్యామని చెప్పారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top