పిచ్చోడు.. చంద్రబాబు ఇద్దరూ ఒక్కటే | Loony And Chandrababu Naidu Both Are Equal : RK Roja | Sakshi
Sakshi News home page

May 1 2018 6:38 PM | Updated on May 1 2018 8:29 PM

Loony And Chandrababu Naidu Both Are Equal : RK Roja - Sakshi

సాక్షి, తిరుపతి : పిచ్చోడి చేతిలో రాయి, చంద్రబాబు చేతిలో మైకు ఒక్కటేనని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. మంగళవారం ఆమె తిరుపతిలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎటు విసురుతాడో తెలీదని, అదే తీరులో చంద్రబాబు చేతిలో మైక్‌ ఉంటే ఏం మాట్లాడుతాడో ఎవరికీ తెలియదంటూ ఎద్దేవా చేశారు. వెంకన్న సాక్షిగా బీజేపీతో దోస్తీ చేసిన బాబు, తన మాటలను మాత్రం ఎందుకు ప్రదర్శించలేదని నిలదీశారు. ప్రస్తుతం చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో​ ఎవరూ లేరని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయిస్తే చంద్రబాబు, లోకేష్‌లు ఊచలు లెక్కబెడతారని రోజా అన్నారు. కుట్ర రాజకీయాలపై పేటెంట్‌ రైట్‌ సీఎం చంద్రబాబుదే అన్నారు. బీజేపీతో అనుబంధాన్ని వదులుకున్నామన్న బాబు టీటీడీ బోర్డులో బీజేపీ మంత్రి భార్యను ఎలా నియమించారు? సుజనా చౌదరిని అరుణ్‌ జైట్లీ దగ్గరకు ఏ లాలూచీ కోసం పంపారు?. గవర్నర్‌తో గంటన్నర సేపు భేటీ అయి ఏ లాలూచీ చేశారంటూ టీడీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement