ఎన్డీయేలో ముసలం : అద్వాణీని కలిసిన మోదీ | Sakshi
Sakshi News home page

ఎన్డీయేలో ముసలం : అద్వాణీని కలిసిన మోదీ

Published Tue, Jun 5 2018 4:13 PM

LK Advani To Contest In 2019 Loksabha Elections - Sakshi

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కురువృద్ధుడు లాల్‌ కృష్ణ అద్వాణీ(90)ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు కలిసినట్లు రిపోర్టులు వస్తున్నాయి. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) నుంచి ప్రాంతీయ రాజకీయ పార్టీలు వైదొలగడంపై చర్చించినట్లు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆనంద్‌బజార్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

ఢిల్లీలోని పృథ్వీరాజ్‌ రోడ్డులోని ఆయన నివాసానికి వెళ్లిన మోదీ, షాలు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎన్డీయేను విడటం, మహారాష్ట్రలో శివసేన, బీహార్‌ జనతా దళ్‌ యునైటెడ్‌(జేడీయూ)లు ఎన్డీయేపై అసంతృప్తితో ఉండటాన్ని చర్చించినట్లు ఆనంద్‌ బజార్‌ పేర్కొంది.

అంతేకాకుండా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఉప ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించటంపై కూడా అద్వాణీతో చర్చించిన మోదీ, షాలు అద్వాణీ, మురళీ మనోహర్‌ జోషీలను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయమని కోరినట్లు వెల్లడించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement