దీపంతో మహమ్మారిని ఎలా ఆపుతారు?

Left Parties Questions Central Ruling Party About Coronavirus - Sakshi

ప్రజలను కొవ్వొత్తులు పట్టుకోమనడం విడ్డూరంగా ఉంది

కేంద్రానికి నాలుగు వామపక్ష పార్టీల ప్రశ్న 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నివారణకు అవసరమైన వస్తు సామగ్రిని అందించే బదులు ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పి కొవ్వొత్తులు పట్టుకోవాలని ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశ ప్రజ లు, విపక్షాలు రాజకీయాల కు అతీతంగా కేంద్రానికి అం డగా నిలిచాయని, అయితే దీప నినాదం ఈ మహమ్మా రి నిరోధానికి ఎలా దోహదపడుతుందని  ప్రశ్నించాయి. ప్రస్తుత ఆపత్కాల సమయంలో రాజకీయాలకు తావివ్వవద్దని చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), సాదినేని వెంకటేశ్వరరావు, పోటు రంగారా వు (సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు) శనివారం ఒక సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆకస్మిక లాక్‌డౌన్‌తో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీల బతుకులు ఛిద్రం అయ్యాయని వారు ఆ ప్రకటనలో విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top