
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రేవంత్ రెడ్డి స్థాయి పడిపోయిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాను చంద్రబాబుకు ఇచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పడంలో వాస్తవంలేద న్నారు. టీఆర్‌ఎస్‌కు టీడీపీయే ప్రత్యామ్నాయమన్నారు. కొడంగల్‌లో త్వరలోనే సభను ఏర్పాటు చేస్తామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కాగా, తమకున్న సమాచారం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందన్నారు.