బలపరీక్షకు సిద్ధమన్న కుమారస్వామి

Kumaraswamy Sought Time From Speaker To Prove Majority - Sakshi

బెంగళూర్‌ : కన్నడ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని, సమయం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ను కోరారు. శాసనసభలో తాను బలం నిరూపించుకుంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక బిల్లును ఆమోదించేందుకు శుక్రవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో కుమారస్వామి విశ్వాస పరీక్షకు కోరడం ఉత్కంఠ రేపుతోంది. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వారిని మినహాయిస్తే మొత్తం 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో సంకీర్ణ ఎమ్మెల్యేల సంఖ్య రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే 100కు పడిపోవడం, బీజేపీ సభ్యుల సంఖ్య 107 కావడంతో బలపరీక్షను కోరడం వెనుక కుమారస్వామి వ్యూహం ఏమిటో అంతుచిక్కడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top