
కొండా రాజీవ్
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): దక్షిణ ఎమ్మెల్యే, అర్బన్ టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని.. అనవసరంగా జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల మీద ఆరోపణలు చేస్తే ప్రజలు తరిమి కొడతారని వైఎస్సార్‌సీపీ నేత కొండా రాజీవ్ గాంధీ అన్నారు. వాసుపల్లి మాటలు దెయ్యాలు వేదాలను వళ్లించినట్టుందని ఎద్దేవా చేశారు. హత్యలు చేసిన తన మనుషులను కాపాడుకోవటం కోసం పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చే వాసుపల్లికి తమ నేతలను విమర్శించే అర్హత లేదన్నారు. తన అనుచరులతో దందాలు సాగిస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వాసుపల్లి నీతిమాలిన నిర్ణయాలతో విసుగు చెందిన సొంత పార్టీ నేతలే ఆందోళన చేసిన విషయంప్రజల మదిలో ఉందన్నారు.తగిన బుద్ధి చెబుతారన్నారు. టీపీడీ మోసాలపై చంద్రబాబు, వాసుపల్లి వేషధారణతో ధర్నా చేస్తానని రాజీవ్ చెప్పారు.