
సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నల్లగొండ నియోజకవర్గంలో ఆయన ఆదివారం విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రచారంలో భాగంగా నల్లగొండ మండలం అన్నేపర్తి నుండి చర్లపల్లి వరకు కోమటిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చర్లపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తలు 300 మంది కాంగ్రెస్‌లో చేరారు. నల్లగొండ పట్టణంలోని నాలుగో వార్డు, అబ్బాసియా కాలనీలోనూ కోమటిరెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దసూరారం గ్రామం నుంచి 300 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీగా వచ్చి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అబ్బాసియా కాలనీకి చెందిన రిజ్వాన్ అలీ ఆధ్వర్యంలో 300 మంది మైనారిటీలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.