వరదాపురం సూరిపై కేతిరెడ్డి ఫైర్‌! | Kethireddy Venkatarami Reddy Fires On Varadapuram Suri | Sakshi
Sakshi News home page

వరదాపురం సూరిపై కేతిరెడ్డి ఫైర్‌!

Apr 15 2019 2:39 PM | Updated on Apr 15 2019 8:41 PM

Kethireddy Venkatarami Reddy Fires On Varadapuram Suri - Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరిపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్‌ అయ్యారు. ఎన్నికల పోలింగ్‌ తర్వాత హింసను సూరి ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. సోమవారం అనంతపురం ఎస్పీని కలిసిన ఆయన సూరి ఆగడాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థులను చంపాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారన్నారు. ఆడియో టేపుల్లో కూడా సూరి వాయిస్‌ స్పష్టంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన ఆస్తుల విధ్వంసం, భౌతిక దాడుల కేసుల్లో సూరిని నిందితుడిగా చేర్చాలని కోరారు. వరదాపురం సూరి హింసా రాజకీయాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement