అభివృద్ధికి ప్రతిపక్షాల అడ్డు: కేకే

Kesava Rao fires on oppositions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షాలు అనవసరంగా అడ్డు తగులుతున్నాయని టీఆర్‌ఎస్‌ పీపీ నేత, ఎంపీ కేశవరావు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సేవాదళం అధ్యక్షుడు ఆమీర్‌ ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ‘ప్రతిపక్షాలు ప్రతీ పనికి అడ్డుతగులుతున్నాయి. ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నా యి.

సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ముందుకు సాగనీయడం లేదు. వారి ఆరోపణలపై ప్రజల్లోనే తేల్చుకోవాలని ముందస్తుకు వెళ్లాం’ అని కేకే అన్నారు. కేసీఆర్‌ను గెలిపించడానికి ప్రతీ కార్యకర్త, సేవాదళ్‌ కార్యకర్తలు మరిం తగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు చారిత్రక అవసరమని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు.   

‘ఓటమి భయంతోనే ఒంటేరు ఆరోపణలు’
సాక్షి, హైదరాబాద్‌: గజ్వేల్‌లో ఓడిపోతానన్న భయంతోనే మహాకూటమి అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి హరీశ్‌రావుపై విమర్శలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, పార్టీ కార్యదర్శి గట్టు రాంచంద్రారావు, టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదివారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎమ్మెల్సీ శ్రీని వాసరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావుపై ఒంటేరు ఇష్టానుసారంగా చేస్తున్న విమర్శలు, కుట్రలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన స్కిప్ట్రునే చదువుతున్న ఒంటేరును పార్టీ నుంచి బహిష్కరించడమే కాం గ్రెస్‌కు మేలని గట్టు రాంచంద్రారావు సూచిం చారు. నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్‌కౌంటర్ల పేరుతో తెలంగాణ ప్రజలను చంపించిన చరిత్ర దేవేందర్‌గౌడ్‌దని కాబట్టి ఆయనే తెలం గాణకు క్షమాపణ చెప్పాలని, కేసీఆర్‌ కాదని గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌     అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top