
అరవింద్ కేజ్రీవాల్
సాక్షి, ఢిల్లీ : తమ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రేషన్ హోం డెలివరీ పథకానికి సహకరించాలని ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బజాజ్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కోరారు. రేషన్ దుకాణంలో అవకతవకలను నిరోదించాలని ఢిల్లీ ప్రభుత్వం నూతన రేషన్ విధానాన్ని ప్రకటించింది. కొన్ని రోజుల కింద ప్రభుత్వ పథకాలలో అవకతవకలు జరుగుతున్నాయని, రేషన్ మాఫియాగా తయారైందని ఎల్‌జీ ప్రభుత్వం పై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కేజ్రివాల్‌కి అనిల్ బజాజ్ మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన పథకానికి సహాకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు.