కేసీఆర్‌ సభ సూపర్‌హిట్‌

Kcr Meeting Success At Medak - Sakshi

సాక్షి, నర్సాపూర్‌ రూరల్‌: కేసీఆర్‌ సభ గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్‌ నింపింది. జహీరాబాద్, మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అల్లాదుర్గం, నర్సాపూర్‌లలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. దీంతో సభ పరిసరాలు గులాబీ మయమయ్యాయి. టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థులు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు మద్దతుగా నిర్వహించిన ఈ సభల్లో గులాబీ బాస్‌ కేసీఆర్‌ ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయమైందని, మెజార్టీయే ప్రధానమని పేర్కొన్నారు. కళాకారుల నృత్యాలు, ఆటపాటలు కార్యకర్తలను ఉత్సాహ పరిచాయి. దీంతో సభ ప్రాంగణాలు సందడిగా మారాయి. వాతావరణం సైతం చల్లబడటంతో జనం ఉత్సాహంగా సమావేశానికి తరలివచ్చారు.                   

నర్సాపూర్‌ సభ హైలైట్స్‌:

∙   సీఎం కేసీఆర్‌ హెలిక్యాప్టర్‌ 6:19 నర్సాపూర్‌ సభ వద్దకు చేరుకుంది.
∙   సీఎం కేసీఆర్‌ 6:42 నుంచి ప్రసంగాన్ని ప్రారంభించి 7:2గంటల వరకు మాట్లాడారు.
∙   సభ ప్రాంగణం వద్ద నీటి ప్యాకెట్ల కోసం జనం ఎగబడ్డారు.
∙   మధ్యాహ్నం నుంచి సభ ప్రాంతంలో చిరు తిండ్ల వ్యాపారం జోరుగా కొసాగింది.
∙   దిగవంత టీఆర్‌ఎస్‌ నేత చిలుముల కిషన్‌రెడ్డి భార్య సుహాసినిరెడ్డిని సీఎం సభ వేదికపై అసీనులయ్యే ముందు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
∙   సభలో మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రసంగం చేస్తుండగా సభ వేదికపైకి సీఎం రావడంతో మధ్యలోనే ఆపేశారు.
∙   సభ వద్దకు వచ్చే ప్రజలను, నాయకులు, కార్యకర్తలను పోలీసులు మెటల్‌ డిటెక్టర్‌తో క్షుణంగా తనిఖీ చేసి అనుమతించారు.
∙   రెండు కిలోమీటర్ల దూరంలో పార్కింగ్‌ ఏర్పాటు చేయడంతో సభ ప్రాగంణ వద్దకు వృద్ధులు, దివ్యాంగులు కాలినడకన చేరుకున్నారు.
∙   సీఎం ప్రసంగాన్ని నర్సాపూర్‌–వెల్దుర్తి ప్రధాన రహదారిపై నిలబడి శ్రద్ధగా విన్నారు.
∙  నర్సాపూర్‌ పట్టణం నుంచి సభా ప్రాంగణం వరకు వరంగల్‌కు చెందిన ఓగ్గు కళాకారులు డోల్‌ దెబ్బ విన్యాసల ప్రదర్శన కొనసాగింది వారి వెనుక నర్సాపూర్‌ ప్రజలు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివెళ్లారు.
∙   గిరిజనులు నృత్యలు ఆకట్టుకున్నాయి. కళాకారుడు, గాయకుడు సాయిచంద్‌ ఆటపాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. 

అల్లాదుర్గం సభ హైలైట్స్‌

  అల్లాదుర్గం మండలం చిల్వెర ఐబీ చౌరస్తాలోని సభ ప్రాంగనానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 5 గంటల ప్రాంతంలో హెలీకాప్టర్‌ చేరుకుంది.
  సభా వేదికపైకి సీఎం 5.15 గంటలకు చేరుకున్నారు.
  ముఖ్యమంత్రి కేసీఆర్‌ 21 నిమిషాలు ప్రసంగించారు.
∙   సీఎం ప్రసంగం ముగియగానే ప్రజలు భారీకేడ్లను తొలగించుకుని వెళ్లిపోయారు.
  బాజాభజంత్రీలతో ర్యాలీగా నృత్యం చేస్తూ కార్యకర్తలు సభా స్థలికి చేరుకున్నారు.
  అల్లాదుర్గం చౌరస్తా నుంచి చిల్వెర గ్రామం వరకు 3 కిలోమీటర్ల రోడ్డు జన ప్రవాహంతో నిండిపోయింది.
∙   టీవీ యాంకర్‌ మంగ్లీ, కళాకారులు ఆట పాటలతో ప్రజలను ఉత్సాహపరిచారు.
  వాహనాల పార్కింగ్‌ వాహనాలతో నిండిపోయింది
∙   సభ స్థలంలో గిరిజన నృత్యాలు అలరించాయి.
 ఈ ప్రాంతానికి చెందిన గిరిజనులు సంస్కృతి ప్రతిబింబించేలా గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి సభకు వచ్చారు.
∙   నారాయణఖేడ్‌ను జిల్లాగా ప్రకటించాలని యువకులు ప్లకార్డులు పట్టుకున్నారు.
∙   సీఎం హెలీక్యాప్టర్‌ సభాస్థలి వద్ద ఒక రౌండ్‌ తిరగడంతో ప్రజలు దాన్ని చూసేందుకు పైకి చూశారు.
  సీఎం సభ ముగిసిన తర్వాత హెలీప్యాడ్‌ వద్ద 15 నిమిషాల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top