కమల్‌ నాలుక కట్‌ చేయాలి: మంత్రి

Kamal Tongue Should Cut Says TN minister KT Rajenthra Bhalaji - Sakshi

సాక్షి, చెన్నై: మక్కల్‌ నీధి మయ్యమ్‌ అధినేత కమల్‌హాసన్‌ హిందూ ఉగ్రవాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర భారత్‌ లో మొట్టమొదటి హిందూ ఉగ్రవాది నాథూరామ్‌ గాడ్సే అని వ్యాఖ్యలు చేసిన కమల్‌హాసన్‌ నాలుకను కత్తిరించాలని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల ఓట్ల కోసమే కమల్‌హాసన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓ వ్యక్తి కారణంగా మొత్తం మతాన్ని నిందించలేమన్నారు.

ఎన్నికల సంఘం కమల్‌హాసన్‌పై చర్యలు తీసుకుని, ఆయన పార్టీపై నిషేధం విధించాలని రాజేంద్ర బాలాజీ డిమాండ్‌ చేశారు. మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సేను ప్రస్తావిస్తూ దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనన్న మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై భగ్గుమన్న బీజేపీ  కమల్‌పై  చర్యలు తీసుకునే విధంగా ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఇదివరకే ప్రకటించారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ కూడా కమల్‌ కామెంట్స్‌ను తప్పుపట్టారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top