కమల్‌ మీటింగ్ బావుంది.. మాది ఒకే లక్ష్యం : రజనీ | kamal haasan public meeting was good : Rajinikanth | Sakshi
Sakshi News home page

కమల్‌ మీటింగ్ బావుంది.. మాది ఒకే లక్ష్యం : రజనీ

Feb 23 2018 1:22 PM | Updated on Feb 23 2018 3:43 PM

kamal haasan public meeting was good : Rajinikanth - Sakshi

కమల్‌ హాసన్‌ పార్టీపై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంటున్న రజనీకాంత్‌

సాక్షి, చెన్నై : తన మిత్రుడు ప్రముఖ నటుడు, రాజకీయ నేతగా మారిన కమల్‌ హాసన్‌పై తమిళ తలైవా, సూపర్‌స్టార్‌, త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారనున్న రజనీకాంత్‌ ప్రశంసలు కురిపించారు. తాను కమల్‌ బహిరంగ సమావేశాన్ని చూశానని, చాలా బాగా ఉందని కొనియాడారు.

వారిద్దరు పోకడలు, పద్ధతులు వేరువేరైనా వారి లక్ష్యం మాత్రం ఒకటేనని, అది కూడా ప్రజలకు మంచి చేయడమేనని రజనీ చెప్పారు. బుధవారం సాయంత్రం కమల్‌ హాసన్‌ 'మక్కళ్‌ నీది మయ్యం' (ఎంఎన్‌ఎం) అనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్‌ పార్టీపై రజనీ తొలిసారి స్పందించారు. త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు ఉంటుందని రజనీకాంత్‌ అభిమానులతో చెప్పారు. నిజాయితీ, క్రమశిక్షణే మన బలం అని, గెలుపోటములు ముఖ్యంకాదని, తమకెవరు రాజకీయ పార్టీలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement