ఎన్నికలంటే కాంగ్రెస్‌కు భయం: జూపల్లి | Jupally Krishna Rao Slams Congress | Sakshi
Sakshi News home page

ఎన్నికలంటే కాంగ్రెస్‌కు భయం: జూపల్లి

Mar 21 2018 3:46 PM | Updated on Mar 18 2019 7:55 PM

Jupally Krishna Rao Slams Congress - Sakshi

జూపల్లి కృష్ణారావు

 సాక్షి, హైదరాబాద్‌: ఉప ఎన్నికలకు భయపడే శాసన సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్‌ కోర్టుకు వెళ్లిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆయన బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో  విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతలకు ఎన్నికలంటే భయం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. మళ్లీ గెలుస్తామనే నమ్మకం ఉంటే కాంగ్రెస్‌ ప్రజా తీర్పును కోరాలని సూచించారు. ప్రజాతీర్పుకు వెళ్లకుండా  కోర్టును ఆశ్రయించారంటే కాంగ్రెస్‌ ఓటమిని అంగికరించినట్లేనని జూపల్లి ఎద్దేవా చేశారు. ఈ అసెంబ్లీ  సమావేశంలోనే పంచాయతీ రాజ్‌ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement