నిన్న జనసేన.. ఈరోజు బీఎస్పీ

Janasena Leader Ravi Kumar Murthy Joins BSP - Sakshi

పశ్చిమ గోదావరి జిల్లా: ఎన్నికల వేళ తెలుగురాష్ట్రాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు ఒక పార్టీలో ఉన్న అభ్యర్థులు మరుసటి రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు. ఇటీవలే ఏలూరు రేంజ్‌ డీఐజీగా పదవీ విరమణ చేసిన రవికుమార్‌ మూర్తి జనసేన పార్టీలో చేరారు. తన సొంత ప్రాంతమైన తిరుపతి ఎంపీ సీటును జనసేన నుంచి రవికుమార్‌ ఆశించారు.

తిరుపతి సీటు దక్కకపోవడంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచనతో బీఎస్పీ అభ్యర్గిగా కొవ్వూరుకు మారారు. పొత్తులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సీటును జనసేన బీఎస్పీకి కేటాయించిన సంగతి తెల్సిందే. నిన్నటి వరకు జనసేనలో ఉండి ఒక్క రోజులోనే కండువా మార్చి బీఎస్పీ అభ్యర్థిగా సోమవారం మాజీ డీఐజీ రవికుమార్‌ మూర్తి నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో అవాక్కవడం పార్టీ నేతల వంతైంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top