
సాక్షి, హైదరాబాద్: బీసీ ఓటర్ల మద్దతుతోనే ప్రధాని నరేంద్ర మోదీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయం సాధించారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అఖండ మెజార్టీతో గెలుపొంది కేంద్రంలో మోదీ, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.