
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ ఎన్‌కౌంటర్ కేసీఆర్ ఫాసిస్టు పాలనకు పరాకాష్ట అని, 12 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేయడం హేయమైన చర్య అని వరవరరావు మండిపడ్డారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారికి ఫోరెన్సిక్ వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించాలని, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు.