బీజేపీ కొత్త సీఎం ఎవరి అల్లుడో తెలుసా..? | interest news about himachal cm jairam t‍hakur | Sakshi
Sakshi News home page

బీజేపీ కొత్త సీఎం ఎవరి అల్లుడో తెలుసా..?

Dec 26 2017 6:45 PM | Updated on Dec 26 2017 6:45 PM

interest news about himachal cm jairam t‍hakur - Sakshi

సాక్షి, మైసూరు: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రాం ఠాకూర్‌ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్న ఆయన కర్ణాటక అల్లుడు. అవును నిజంగానే ఆయన కన్నడ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. జై రామ్ వివాహం చేసుకుంది శివమొగ్గకు చెందిన సాధాన అనే డాక్టర్‌ను. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లడంతో 1980లో జైపూర్‌లోని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీలో ఆమె వైద్యవిద్యను అభ్యసించారు. ఏబీవీపీలో కూడా చురుగ్గా ఉన్న ఆమె ఆ సమయంలోనే ఠాకూర్‌ను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజపుత్ర వంశ నేత అయిన జై రాం ఇటీవల వరుసగా ఐదోసారి హిమాచల్ ప్రదేశ్‌లోని సిరజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అక్కడ ముఖ్యమంత్రి రేసులో ఉన్న ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఆ స్థానంలో అనూహ్యంగా జై రాం ఠాకూర్‌ ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. ఆయన పేరును కూడా ధుమాలే ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement