'దౌత్యకార్యాలం జెరూసలేంకు మార్చండి'

India should shift embassy from Tel Aviv: Subramanian Swamy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌ రాజధాని వ్యవహారం ఓ పక్క వివాదంగా మారుతుండగా వెంటనే భారత్‌ తన దౌత్య కార్యాలయాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి జెరూసలేంకు మార్చాలంటూ బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. గురువారం ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్న ఆయన 'జెరూసలేం ఇజ్రాయెల్‌ భూభాగంగా గుర్తింపు లభించడంతో ఆ దేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇక భారత్‌ తన దౌత్య కార్యాలయాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి జెరూసలేంకు మార్చాల్సిందే' అని అన్నారు.

ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలేంను ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకోవడంతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. పలు అరబ్‌ దేశాలతోపాటు యురోపియన్‌ యూనియన్‌లోని పలు దేశాలు, ఐక్యరాజ్యసమితి విభాగం కూడా ట్రంప్‌ను విమర్శిస్తున్నారు. భారత్‌ కూడా ఇప్పటి వరకు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈలోగా భారత ప్రభుత్వంలో భాగస్వామి అయిన సుబ్రహ్మణ్య స్వామి పై విధంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top