
టీడీపీ నేత బాలసుబ్రమణ్యం(పాత చిత్రం)
వైఎస్సార్ జిల్లా: రాయచోటి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రాయచోటి నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యం ప్రకటించారు. సుబ్రమణ్యం గతంలో జెడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలసుబ్రమణ్యం పోటీ చేశారు.
కార్యకర్తల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాయచోటి నుంచి బాల సుబ్రమణ్యం తండ్రి పాలకొండ్రాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాయచోటి అసెంబ్లీ టికెట్ రమేశ్ రెడ్డికి కేటాయించడమే బాలసుబ్రమణ్యం అసంతృప్తికి కారణమైంది.