నామాను గెలిపించాలి : సినీహీరో వేణు

చింతకాని: ఖమ్మం పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీ హీరో తొట్టెంపూడి వేణు కోరారు. నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో శనివారం వేణు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ నామా నాగేశ్వరరావు గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి నామా విజయానికి పాటుపడాలని కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వంకాయలపాటి లచ్చయ్య, సత్యనారాయణ, తోటకూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నామాతోనే అభివృద్ధి సాధ్యం
ముదిగొండ: ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలంటే నామా నాగేశ్వరరావును గెలిపించాలని సినీహీరో తొట్టెంపూడి వేణు కోరారు. మండలంలోని బాణాపురంలో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు పచ్చా సీతారామయ్య, మండల నాయకులు దేవరపల్లి ఆదినారాయణరెడ్డి, మరికంటి సత్యనారాయణ, అనిత, శ్రీరాములు పాల్గొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి