ఏపీ: ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణం! | GVL Narasimha Rao Fires On TDP Leaders | Sakshi
Sakshi News home page

లాలూకు పట్టిన గతే మీకూ పడుతుంది : జీవీఎల్‌

Aug 5 2018 3:47 PM | Updated on Aug 10 2018 8:42 PM

GVL Narasimha Rao Fires On TDP Leaders - Sakshi

జీవీఎల్‌ నరసింహారావు (ఫైల్‌ ఫోటో)

కాగ్‌ నివేదిక నుంచి 53 వేల కోట్ల కుంభకోణం తప్పించుకోలేదని...

సాక్షి, అమరావతి : ఏపీలో రూ. 53వేల కోట్లు దారిమళ్లాయని, టీడీపీ ప్రభుత్వం ఈ సొమ్మును 58 వేల పీడీ అకౌంట్లలో వేసిందని, ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. జీవీఎల్‌ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాగ్‌ నివేదికతో ఈ కుంభకోణం బహిర్గతం అవుతుందని, కాగ్‌కు టీడీపీ నేతలు ఈ విషయాలు తెలియజేయకున్నా.. కాగ్‌ దృష్టి నుంచి ఈ విషయాన్ని తప్పించలేరని అన్నారు. టీడీపీ నాయకులు అవినీతి దొంగల్లా మట్లాడుతున్నారని, తాను అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమల్ని క్షమించరని వ్యాఖ్యానించారు. బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి పట్టిన గతే మీకు పడుతుందని టీడీపీ నేతలను హెచ్చరించారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక షేర్‌ మార్కెట్‌ బ్రోకర్‌తో సమాధానం చెప్పిస్తున్నారని విమర్శించారు. 53 వేల కోట్ల అవినీతిపై శ్వేత పత్రం విడుదల చేయాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై టీడీపీ నేతలకు ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు. పీడీ అకౌంట్స్‌లో డబ్బులు ఉండగా ఎందుకు అప్పులు తెస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement