‘టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండదు’

Grandi Srinivas Slams On TDP Leaders Over Nandigama Suresh Incident - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: చంద్రబాబు, లోకేష్, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. ఎంపీ నందిగామ సురేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ..  చంద్రబాబు చేసిన అవినీతి గుట్టు రట్టు అవుతుందన్నారు. అందుకే ప్రజల దృష్టి మళ్లించడానికి టీడీపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు కల్పిస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ నేతల మీద దాడులు చేసి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ నేతలు చూస్తున్నారని శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఉదాహారణ ఎంపీ నందిగామ సురేష్‌పై దాడిచేయటమే అని​ తెలిపారు. చంద్రబాబు చేస్తున్న కుళ్లు రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇక టీడీపీ అనేది తెలంగాణలో ఎలా అయిందో అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉండదని అన్నారు. వైద్యపరికరాలు కొనుగోలు విషయంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, పీతాని సత్యనారాయణ కోట్లాది రూపాయలు ఎలా దోచుకున్నారో బయటపడిందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌ తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top