
సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నారయణరావు మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ మొత్తం పటేల్ రాజ్యంగా మారిందని అన్నారు. అక్కడ బీసీలను, సీనియర్ నాయకులను తొక్కి పడేస్తున్నారని వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఎన్నికల నామినేషన్ వేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. గాంధీ భవన్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టటమే తన ధ్యేయమన్నారు.
కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయిందని, రాష్ట్రంలో 46 స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని జోష్యం చెప్పారు. బీసీలకు అన్యాయం చేయటం వల్లనే కాంగ్రెస్ ఓటమి పాలవుతుందని పేర్కొన్నారు. స్వతంత్ర్య అభ్యర్థిగా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.