యూపీలో యోగికి షాక్‌

Former UP President of Hindu Yuva Vahini Sunil Singh Joins Samajwadi Party - Sakshi

లక్నో: యోగి ఆదిత్యనాథ్‌ యూపీ సీఎంగా అయ్యేంతవరకు ఆయనకు కుడిభుజంగా ఉన్న హిందూ యువ వాహిని (హెచ్‌వైవీ) మాజీ అధ్యక్షుడు సునీల్‌ సింగ్‌ శనివారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆపార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌  సమక్షంలో పార్టీలో చేరారు. సునీల్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 2017లో హిందూ యువ వాహిని నుంచి బహిష్కరించడంతో అప్పట్నుంచి వేరే సంస్థను నెలకొల్పి దానికి జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.  యోగి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని, ఇక ఆ ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నేతలపై యోగి సర్కార్‌ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకొచ్చాక హిందూ ముస్లిం వర్గ విభేదాలను ప్రోత్సహిస్తోందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top