బాబు చరిత్ర అంతా మోసం, కుట్రలే

Ex MLA Dr Sivarama Krishnaiah Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, కడప కార్పొరేషన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గత చరిత్ర అంతా మోసం, దగా, కుట్రలేనని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ శివరామక్రిష్ణయ్య అన్నారు. మంగళవారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఆయన సీనియర్, ఎంతో అనుభం ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు చంద్రబాబును గద్దెనెక్కించారన్నారు. 1978లో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు, డీఎల్‌ రవీంద్రారెడ్డి, తాను ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టామని అప్పటి నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు మోసాలను, అబద్ధాలనే నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఎవరూ ప్రకటించని విధంగా 175 అసెంబ్లీ, 25ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ఎంపిక చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు సృష్టించారన్నారు. అందులోనూ అన్ని సామాజిక వర్గాలకు సీట్లు కేటాయించి సమ సమాజ స్థాపన తనతోనే సాధ్యమని నిరూపించారన్నారు. బ్రాహ్మణులను, భగవంతుడిని కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబేనన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు  11వ తేదీన  ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు  వేయాలని కోరారు.బ్రాహ్మణ కార్పొరేషన్‌లో రూ.50 కోట్ల స్కాం: ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌లో చైర్మన్‌ ఆనంద్‌ సూర్య రూ.50కోట్ల స్కామ్‌ చేశారని వైఎస్‌ఆర్‌సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు జ్వాలా నరసింహ శర్మ, ఎంఎల్‌ఎన్‌ సురేష్‌బాబు, వెల్లాల నిరంజన్‌ శర్మలు ఆరోపించారు. బ్రాహ్మణులను రాజకీయంగా పైకి తెచ్చిన పార్టీ వైఎస్‌ఆర్‌సీపీయే అన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top