చంద్రబాబు కుయుక్తులు తిప్పికొట్టండి

East Godavari YSRCP leaders Slams Chandrababu naidu - Sakshi

బీసీలకిచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

అఖిలపక్ష సమావేశంలో పలు రాజకీయ పార్టీల నేతల ధ్వజం

తూర్పుగోదావరి,  (రాజమహేంద్రవరం సిటీ): నాలుగున్నర ఏళ్లుగా బీసీల వైపు కన్నెత్తి చూడని చంద్రబాబు ఎన్నికల సమీస్తుండడంతో వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారని, చంద్రబాబు కుయుక్తులను బీసీలు తిప్పికొట్టాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం వై.జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో సోమవారం బీసీ కులాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ సిటీ కో అర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షత వహించారు.

రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కవురు శ్రీనివాస్, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ కో అర్డినేటర్‌ మార్గాని భరత్‌ రామ్, బీసీ సంఘాల సమాఖ్య రాష్ట్ర చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గరిమెళ్ళ చిట్టిబాబు, లోక్‌సత్తా పార్టీ నాయకులు రాజ్‌గోపాల్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బర్రే కొండబాబు, సీపీఐ, సీపీఎం నాయకులు, పలు కుల సంఘాల నాయకులు హాజరయ్యారు. కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో చంద్రబాబు బీసీలకు  ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మరో మోసానికి తెర తీశారన్నారు. బీసీ డిక్లరేషన్‌ ప్రకారం బీసీలకు 100 శాసనసభ స్థానాలు ఇస్తామని, ఏటా రూ.10 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ ఏర్పాటు ఇస్తామని హామీలు ఇచ్చి బీసీలను మోసగించారని మండిపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సదస్సులో పార్టీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, కురుమిల్లి అనూరాధ, వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ కన్వీనర్‌ మజ్జి అప్పారావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కో అర్డినేటర్‌ నరవ గోపాలకృష్ణ, నీలం గణపతి, నీలి ఆనంద్, మరుకుర్తి నరేష్‌ కుమార్‌ యాదవ్, సయ్యద్‌ రబ్బానీ, చాంబర్‌  మాజీ అధ్యక్షుడు అశోక్‌ కుమార్‌జైన్‌ రత్నమణి, మాజీ కార్పొరేటర్‌ తామాడ సు«శీల, అందనపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

హామీలు ఇవ్వడం అలవాటే
అమలు కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు అలవాటే. గత ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీల అమలు నేటికీ నోచుకోలేదు. మళ్లీ అవాస్తవమైన హామీలతో ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు.    – మార్గాని భరత్‌ రామ్, వైఎస్సార్‌ సీపీ, రాజమహేంద్రవరం పార్లమెంటరీకో అర్డినేటర్‌

పట్టించుకోవడం లేదు
ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన తరువాత పట్టించుకోవడం లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలతో పాటు, పేదల సంక్షేమానికి ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశారు.  – రాజ్‌గోపాల్, లోక్‌సత్తా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top