ప్రజాస్వామ్యం చచ్చిపోయింది | Democracy has died | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం చచ్చిపోయింది

Nov 4 2018 2:14 AM | Updated on Nov 5 2018 6:50 PM

Democracy has died - Sakshi

మాట్లాడుతున్న పోసాని. చిత్రంలో మాగంటి

హైదరాబాద్‌:  ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ నేతగా పుట్టినప్పుడే ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి అన్నా రు. చంద్రబాబు విలువలు, వ్యవస్థలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ ప్రచారంలో భాగంగా శనివారం ఎల్లారెడ్డిగూడలోని పోసాని నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ చంద్రబాబు వెన్నుపోటుదారుడని, మోసగాడని, ఆయన స్వలా భం కోసం ఎవరితోనైనా కలవడానికి సిద్ధంగా ఉంటాడని విమర్శించారు.

ఒకప్పుడు కాంగ్రెస్‌ గురించి నీచంగా మాట్లాడిన చంద్రబాబు తన కేసుల కోసం తెలంగాణలో కాంగ్రెస్‌తో కలి శారని, ఓటర్లు ఈ విషయా న్ని గమనించాలన్నారు. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగితే ఓ పత్రిక(చంద్రబాబుకు కొమ్ముకాసే) కోడి కత్తి కేసు అని రాయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇదే చంద్రబాబు కొడుకు లోకేశ్‌కో, సదరు పత్రిక అధినేత కొడుక్కో జరిగితే రాష్ట్రం దద్దరిల్లేలా ధర్నాలు చేసేవారని ఆరోపించారు. బాబుకు అలిపిరి లో దాడి జరిగితే హత్యాయత్నం, జగన్‌ మీద కత్తితో దాడి జరిగితే కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆంధ్ర ప్రజలు గమనిస్తున్నారు...
ఆంధ్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఓటుతో తమ వైఖరిని తెలుపుతారని పోసాని అన్నారు. జగన్‌పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని, రానున్న ఎన్నికల్లో అలాంటి వ్యక్తి వస్తేనే ప్రజాస్వామ్యం ఊపిరిపోసుకుంటుందన్నారు.  నిజాలు మాట్లాడితే తన తల వేయి ముక్కలవుతుందనే శాపం చంద్రబాబుకు ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్వలాభం కోసం ఏ పార్టీతోనైనా పొత్తుకు వెనుకాడరన్నారు.  కేసీఆర్‌ మంచి పరిపాలన చేస్తున్నారని, దేశంలోనే నంబర్‌వన్‌ సీఎం అని కితాబిచ్చారు.  కేసీఆర్‌ పాలనలో ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉన్నారని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement