వైఎస్సార్‌సీపీకి ఓటేశారని సామాజిక బహిష్కరణ

Dalit Family Social Boycott By TDP Leaders In East Godavari - Sakshi

సాక్షి, అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో టీడీపీ నేతలు అధికార మదంతో రెచ్చిపోయారు. రాజ్యాంగ నిర్మాత అబేంద్కర్‌ ఆశయాలకు నిలువునా తూట్లు పొడిచారు. తమకు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్ఛను హరించారు. గత (ఏపీ అసెంబ్లీ-2014) ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేశారని ఓ దళిత కుటుంబంపై పచ్చనేతలు కన్నెర్రజేశారు. అగ్రకుల దరహంకారంతో ఆ కుటుంబాన్ని గత ఐదేళ్లుగా సామాజికంగా బహిష్కరించారు.

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆ కుంటుంబాన్ని వేధింపులకు గురిచేశారు. ఓటు వేయొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఓటు వేసినా టీడీపీకి కాకుండా ఇతర పార్టీలకు వేస్తే అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు.  అయితే, పోలీసుల సహకారంతో ఆ కుటుంబం ఓటు హక్కును వినియోగించుకోవడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. ఊరొదిలి వెళ్లిపోవాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తుడంటంతో దిక్కుతోచని ఆ కుటుంబం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని మంగళవారం కలిసింది. తమకు న్యాయం చేయాలని వారు సీఈఓకు విన్నవించుకున్నారు. ఇక స్థానిక అధికారులు టీడీపీ నేతల ఆగడాలకు సాక్షులుగా మాత్రమే మిగిలారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top