వైఎస్‌ జగన్‌తో దగ్గుబాటి భేటీ | Daggubati Meets YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌తో దగ్గుబాటి భేటీ

Jan 27 2019 2:32 PM | Updated on Jan 27 2019 6:42 PM

Daggubati Meets YS Jagan Mohan Reddy - Sakshi

హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో సీనియర్‌ నాయకుడు, ఎన్టీఆర్‌ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లో జగన్‌తో దగ్గుబాటి భేటీ అయ్యారు. తన కుమారుడు హితేష్‌తో కలిసి జగన్‌ నివాసానికి చేరుకున్న దగ్గుబాటికి వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సాదర స్వాగతం పలికారు. 

గత కొంతకాలంగా దగ్గుబాటి కుటుంబం.. వైఎస్సార్‌సీపీలో చేరే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌తో దగ్గుబాటి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరావు భార్య పురందేశ్వరి బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement