
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో, ఎగ్జిట్‌పోల్స్, సర్వేల అంచనాలకు సైతం అందకుండా.. తాజా అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం అందుతున్న కౌంటింగ్ సరళిని చూసుకుంటే 150కిపైగా సీట్లతో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించబోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఘోర ఓటమి ఖాయం కావడంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామా చేయబోతున్నారు. నేటి (గురువారం) సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబు గవర్నర్‌కు పంపించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలిసే అవకాశముంది.