రైతు సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం | Chintala Ramachandra Reddy Fire On Ts Govt | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం

Oct 26 2017 2:11 AM | Updated on Oct 26 2017 2:11 AM

Chintala Ramachandra Reddy Fire On Ts Govt

సాక్షి, హైదరాబాద్‌: రైతు సమస్యలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేద ని, దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ శాసన సభాపక్షం బుధవారం భేటీ అయ్యింది. అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలసి చింతల విలేకరులతో మాట్లాడారు. బాబు జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా వస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వోద్యోగాల భర్తీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలే దన్నారు. బీజేపీ కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులపై సభలో నిలదీస్తా మన్నారు. గురువారం టీటీడీపీ, బీజేపీ ఫ్లోర్‌ కోఆర్డినేషన్‌ కోసం సమావేశామవు తున్నట్లు, తమ పార్టీ నుంచి బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావులు పాల్గొంటారని చింతల చెప్పారు. వర్షాల వల్ల నష్టపోయిన పత్తి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement