చిదంబరానికి స్వల్ప ఊరట | Sakshi
Sakshi News home page

చిదంబరానికి స్వల్ప ఊరట

Published Mon, Sep 2 2019 4:27 PM

Chidambaram Gets Slight Relief From INX Media Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీల్యాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వయసు రీత్యా తీహార్‌ జైలుకు పంపవద్దన్న ఆయన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. చిదంబరం తరపున వాదనలు వినిపించిన కపిల్‌ సిబల్‌ ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్‌ మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో గృహ నిర్భంధానికైనా ఆదేశించాలన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ విషయాన్ని ట్రయల్‌ కోర్టులో ప్రస్తావించాలని సూచించింది. సిబల్‌ విజ్ఞప్తిని అంగీకరించిన కోర్టు చిదంబరాన్ని జైలుకు పంపొద్దని, బెయిల్‌ తిరస్కరించిన నేపథ్యంలో మరో మూడు రోజులు కస్టడీని కొనసాగించాలని ఆదేశించింది. 

విదేశీ పెట్టుబడులను ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి తరలించారనే ఆరోపణలతో చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్థాపకులు పీటర్‌ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీలు తన కూతురు షీనా బోరా హత్యకేసులో నిందితులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement

తప్పక చదవండి

Advertisement