ఇద్దరికే సారీ!

Change of candidates in adole and chennur - Sakshi

చెన్నూరు, ఆందోల్‌లలో అభ్యర్థుల మార్పు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు తాజా మాజీలకు మాత్రమే  టికెట్లను నిరాకరించారు. చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు టికెట్‌ కేటాయించారు. ఆందోల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినీనటుడు బాబూమోహన్‌కు టికెట్‌ ఇవ్వకుండా, అక్కడ జర్నలిస్టు సీహెచ్‌ క్రాంతికిరణ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.

అయితే, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నల్లాల ఓదెలుకు టికెట్‌ ఇవ్వకపోవడానికి కారణాలను వెల్లడించలేదు. 2009 నుంచి ఇప్పటిదాకా రెండుసార్లు సాధారణ ఎన్నికల్లోనూ, ఒక ఉప ఎన్నికలోనూ ఆయన గెలిచారు. అయితే స్థానికంగా ఉన్న వ్యతిరేకత వల్లనే టికెట్‌ నిరాకరించినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top