పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ | Chandrababu appoints Payyavula Keshav As PAC Chairman | Sakshi
Sakshi News home page

పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌

Jul 24 2019 3:04 PM | Updated on Jul 24 2019 5:05 PM

Chandrababu appoints Payyavula Keshav As PAC Chairman - Sakshi

సాక్షి, అమరావతి: చట్టసభలకు సంబంధించి ప్రజాపద్దుల సంఘం(పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ - పీఏసీ) చైర్మన్‌గా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం పయ్యావుల పేరును ఖరారు చేశారు. కాగా అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌ నాలుగోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా పీఏసీ చైర్మన్‌ పదవి రేసులో టీడీపీ సీనియర్‌ పేర్లు వినిపించినా చంద్రబాబు చివరకు పయ్యావుల వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ప్రతిపాదనలు పంపారు.

Advertisement
 
Advertisement
Advertisement