
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఒక దిక్కుమాలిన, పనికి రాని చట్టమని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. సీఎం చంద్రబాబు విభజన చట్టం హామీలు, అమలు విషయంలో ప్రతిపక్ష పార్టీతో కలసి పనిచేయక పోవటం వల్లే కేంద్రంపై ఒత్తిడి పెరగలేదన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్(ఏపీసీఎల్‌ఏ) ఆధ్వర్యంలో ‘ఏపీ విభజన చట్టం హామీలు–అమలు’ అనే అంశంపై శుక్రవారం సమావేశం జరిగింది. ఏపీసీఎల్‌ఏ అధ్యక్షుడు పొత్తూరి సురేష్ కుమార్, ప్రముఖ న్యాయవాది సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.