దేశంలోనే అవినీతి సీఎం చంద్రబాబు

Bothsa Sathyanarayana Slams Chandrababu naidu - Sakshi

సెంట్రల్‌ సర్వేలో కూడా వెల్లడి

బూత్‌ కమిటీ సమావేశంలో ధర్మాన, బొత్స

శ్రీకాకుళం, రేగిడి: దేశంలోనే నంబర్‌ వన్‌ అవినీతి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పేరు గడించారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం రేగిడి మండలం ఖండ్యాం గ్రామంలో నిర్వహించిన బూత్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి సీఎంగా మొదటి స్థానంలో ఉన్నట్లు సెంట్రల్‌ సర్వే కూడా తేల్చిందని పేర్కొన్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో ఎంత అవినీతి జరిగిందో అర్ధం చేసుకోవచ్చన్నారు. గ్రాఫిక్‌ రాజధానే తప్ప అమరావతిలో వాస్తవంగా అభివృద్ధి జరగలేదని చెప్పారు. లక్షల కోట్లు అప్పుతేవడంతో ప్రతి ఒక్కరిపై ఆర్ధికభారం పడుతుందని, నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్‌ వంటి ఇంధన ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణలో టీడీపీ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారని ఆరోపించారు. తెలంగాణా రాష్ట్రంలో ఐటీ దాడుల్లో పట్టుబడిన రేవంత్‌ రెడ్డి అక్రమార్జన అంతా ఏపీలో చంద్రబాబునాయుడు దోచుకున్నదేనని ఆరోపించారు. బాబు పాలన చూసి ఇటు ప్రజలు, అటు అధికారులు భయపడుతున్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సంక్షేమ పాలన రావాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే సీఎం చేయాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి వెనుక అవినీతి...
వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీలో అవినీతిమంత్రులు అధికమయ్యారని ఆరోపించారు. నీరు చెట్టు, కాంట్రాక్ట్‌లు, రియల్‌ ఎస్టేట్‌ల పేరుతో అక్రమార్జన చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పలుచోట్ల ఓటమి భయంతో వేరే పార్టీలకు చెందిన నాయకులను పార్టీలోకి తీసుకువచ్చి డబ్బుతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల రాజాం నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ మంత్రిని టీడీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించడం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. టీడీపీలో చేరుతున్న కొత్తనాయకులు కూడా అట్రాసిటీ కేసులు, అక్రమాలు, అవినీతి చేసినవారేనని ఆరోపించారు. రేగిడి మండలానికి చెందిన ఓ టీడీపీ మంత్రి 35 ఏళ్లపాటు కుటుంబ పాలన చేశారని, ఇకపై ఆ పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే రాజాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

సమన్వయంతో వ్యవహరించాలి..
బూత్‌ కమిటీలు సమన్వయంతో వ్యవహరించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు పాలవలస రాజశేఖరం అన్నారు. ముందుగా ఓట్లు ఉన్నాయోలేదో చూసుకోవాలని సూచించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ప్రజలు, నాయకులు, కార్యకర్తల ఓట్లను టీడీపీ నాయకులు తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయమై బూత్‌ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులంతా వైఎస్సార్‌ సీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.  ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని అమలు పర్చేలా జగన్‌మోహన్‌రెడ్డి కూడా తండ్రి మాదిరిగానే సేవలందిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ విజయనగరం, శ్రీకాకుళం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ భూమన కరుణాకర్‌రెడ్డి పార్టీ విధివిధానాలు, రానున్న ఎన్నికల్లో బూత్‌ కమిటీల కర్తవ్యం, నవరత్నాల పథకం అమలు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో  డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎస్‌.వి.రమణారావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, నాయకులు మామిడి శ్రీకాంత్, ఉత్తరావిల్లి సురేష్‌ముఖర్జీ, టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, పాలవలస శ్రీనివాసరావు, కరణం సుదర్శనరావు, లావేటి రాజగోపాలనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గేదెల వెంకటేశ్వరరావు, గురుగుబెల్లి స్వామినాయుడు, రెడ్డి నర్సింగరావు, కింజరాపు సురేష్‌కుమార్, బండి నర్సింహులు, వంజరాపు విజయ్‌కుమార్, పొట్నూరు లక్ష్మణరావు, మజ్జి శ్రీనివాసరావు, ఎంపీటీసీ నెల్లి పెంటన్నాయుడు, వంజరాపు అశోక్‌కుమార్, పాడి లక్షున్నాయుడు, కెంబూరు శ్రీహరినాయుడు, కరణం గోవిందరావు, లావేటి అప్పలనాయుడు, రాయపురెడ్డి కృష్ణారావు, నక్క ఆదినారాయణ, నక్క తిరుపతిరావు, బట్న వాసుదేవరావు, అన్ను అప్పారావు, కొండగూడెం మాజీ సర్పంచ్‌ కెంబూరు సూర్యారావు, గులివిందల శ్రీనివాసరావు, శాసపు వేణుగోపాలనాయుడు, రెడ్డి మహేష్, కిల్లాన మోహనరావు, కొమ్ము దుర్గారావు, పాలవలస అప్పలనాయుడు, లెంక చిన్నప్పలనాయుడు, పిట్టా జగదీష్, కోరాడ రామినాయుడు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, బూత్‌ కమిటీ కన్వీనర్లు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యం..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక హోదా సాధ్యపడుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల పక్షాన నిలిచారని అన్నారు. 3వేల కిలోమీటర్లు ప్రజాసంకల్ప యాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని, మరో నెల రోజుల వ్యవధిలో జిల్లాకు రానున్నారని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని స్పష్టం చేశారు. అందుకే పార్టీని నమ్ముకొని ఉండిపోయానని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోబాలు పెట్టినప్పటికీ పార్టీని వీడలేదని, జగన్‌మోహన్‌రెడ్డిపై రాష్ట్ర ప్రజలకు ఎంత నమ్మకం ఉందో, తనకు పార్టీపై అంతే నమ్మకం ఉందన్నారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో రాజాంకు వచ్చే నిధులను, అభివృద్ధి పనులను అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే రాజాంను అభివృద్ధివైపు నడుపుతానని, అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రావాలి జగన్‌... కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నవరత్నాలను వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top