గుజరాత్‌ లో బీజేపీ విజయం | BJP wins 5 of 7 municipality seats, one taluka panchayat seat | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ స్థానిక ఉపపోరులో బీజేపీ విజయం

Oct 10 2017 5:43 PM | Updated on Oct 16 2018 6:33 PM

BJP wins 5 of 7 municipality seats, one taluka panchayat seat - Sakshi

సాక్షి,అహ్మదాబాద్‌: గుజరాత్‌ స్ధానిక సంస్థల ఉపపోరులో బీజేపీ ముందంజలో నిలిచింది. మంగళవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఏడు జిల్లాల పరిధిలోని ఏడు మున్సిపాలిటీలకు గాను ఐదింట బీజేపీ విజయం సాధించింది. వీటికి తోడు ఒక తాలూకా పంచాయితీలోనూ బీజేపీ గెలుపొందింది. తాజాగా ఉప ఎన్నికలు జరిగిన ఎనిమిది చోట్ల గతంలో బీజేపీ కేవలం రెండు సీట్లలోనే గొలుపొందింది.

దీంతో బీజేపీ బలం మూడు రెట్లు పెరగ్గా, గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ గెలుచుకున్నమున్సిపాల్టీల సంఖ్య సగానికి పడిపోయింది. బీజేపీ బొరైవి, మహుధ, విజపూర్‌, పటాన్‌, తలాలా మున్సిపాల్టీల్లో గెలుపొందిం‍ది.గాంధీనగర్‌ జిల్లాలోని రంధేజా తాలూకా పంచాయితీ సీటునూ ఆ పార్టీ కైవసం చేసుకుంది.త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో స్థానిక ఉప పోరులో సానుకూల ఫలితాలు రావడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement