82 మందితో బీజేపీ రెండో జాబితా | BJP releases second list of 82 candidates | Sakshi
Sakshi News home page

82 మందితో బీజేపీ రెండో జాబితా

Apr 17 2018 1:36 AM | Updated on Sep 5 2018 1:55 PM

BJP releases second list of 82 candidates - Sakshi

కుమార్‌ బంగారప్ప, విజయేంద్ర

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 82 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో మైనింగ్‌ వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి (బళ్లారి), మాజీ సీఎం బంగారప్ప కుమారుడు కుమార్‌ బంగారప్ప (సోరబ్‌)లకు చోటు దక్కింది. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రను పార్టీ వరుణ నియోజకవర్గం నుంచి బరిలో దించింది. ఈ స్థానంలో కాంగ్రెస్‌ తరపున సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర పోటీ చేస్తున్నారు.

యడ్యూరప్ప సన్నిహితుడు కృష్ణయ్య శెట్టి బీజేపీ తరపున మాలూర్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అయితే, సీఎంపై చాముండేశ్వరి నుంచి పోటీచేసే అభ్యర్థి పేరును మాత్రం ఇంకా కమలదళం వెల్లడించలేదు. ఏప్రిల్‌ 8న 72 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన పేర్లతో ఇప్పటివరకు బీజేపీ మొత్తం 154 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించినట్లయింది. రెండ్రోజుల్లో మిగిలిన పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement