
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపాయి కూడా బకాయి లేదని, అయినా, రూ. 1935 కోట్లు బకాయిలు ఉన్నాయనడం పచ్చి అబద్ధమని ఆయన మంగళవారం ఢిల్లీలో తెలిపారు.
ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ విషయం స్పష్టమైందని చెప్పారు. అయినా పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.